నా కొడుకు కోసం.. 20 కోట్లు పక్కన పెట్టుకోండి : పియూష్ చావ్లా
అయితే స్టార్ స్పిన్నర్ ఫియూస్ చావ్ల సైతం తన కొడుకు త్వరలో క్రికెట్లో అడుగు పెట్టబోతున్నాడు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లేటు వయసులో కూడా ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతూ ఉన్నాడు చావ్లా. అయితే బౌలర్ కొడుకు బౌలర్ అవుతాడు. కానీ చావ్లా మాత్రం తన కొడుకుని బౌలర్ అవ్వకుండా చూసుకుంటాను అని నాతో చెప్పాడు అంటూ ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ లో పంచుకున్నాడు. నాతో పీయూష్ చావ్లా అన్నాడు.. నా ఏడేళ్ల తనయుడు.. ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు. నా కొడుక్కి క్రికెట్ అంటే ఇష్టం.
అయితే ఇక తన కొడుకు ఒక్కడే క్రికెట్ మ్యాచ్ చూడడమే కాదు.. మ్యాచ్ వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న అందరిని కూడా సోఫాలో కూర్చోబెడతాడు. నేనేమో నా కొడుకుని బౌలర్ కావొద్దు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉంటాను. అతడు బంతి ముట్టుకుంటే చేతి మీద కొడతా. ఎందుకంటే అతను బ్యాట్స్మెన్ కావాలనేదే నా కల. అతనికి ప్రతిరోజు కూడా శిక్షణ ఇప్పిస్తున్న. నెట్స్ లో నేనే బౌలింగ్ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్ లో నేను బౌలింగ్ చేస్తున్నందుకు 50 లక్షలు ఇస్తున్నారు. ఒకవేళ అతను మంచి బ్యాట్స్మెన్ గా మారితే మాత్రం ఓ పదేళ్లలో 20 కోట్లు అయినా ఇస్తారు. నా కొడుకు కోసం 20 కోట్లు పక్కన పెట్టుకోండి అంటూ ముంబై ఇండియన్స్ కు చెప్పాను అని చావ్లా తనతో అన్నాడని అశ్విన్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించాడు.