మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. సన్రైజర్ కి మరో షాక్?

praveen
మూలికే నక్కపై  తాటి పండు పడింది అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి ఇలాగే మారిపోయింది అని చెప్పాలి.  ఎందుకంటే ఈ ఏడాది కొత్త కెప్టెన్ తో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కెప్టెన్ మారాడు కానీ జట్టు ఆట తీరు మాత్రం ఎక్కడా మారలేదు. ఎప్పటి లాగానే పేలవ ప్రదర్శన చేస్తూ వరుస ఓటములతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే జట్టు ఆట తీరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.



 అయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో టైటిల్ అందించిన మార్కరమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు అని అందరూ అనుకున్న.. అది కుదరడం లేదు. అయితే ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ జట్టుకు మూలిగే నక్క పై తాడిపండు పడింది అన్నట్లుగానే  మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుగా ఇక ఇప్పుడు మరో స్టార్ ఆల్ రౌండర్ కొన్ని మ్యాచ్లకు కాదు పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది. స్టార్ ఆల్ రౌండర్ ఎవరో కాదు వాషింగ్టన్ సుందర్.


 మిగతా ఆటగాళ్ళతో పోల్చి చూస్తే వాషింగ్టన్ సుందర్ కాస్త కుస్తో రాణిస్తూ ఉన్నాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ తరఫున ఐదు ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. అయినా టీమ్ నుంచి సహకారం లభించలేదు. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు వాషింగ్టన్ అందరికీ గాయంతో దూరం కావడం ఇది మూడోసారి. 2021 ఐపిఎల్ సీజన్ లో   రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడు వికెట్లు తీసిన తర్వాత గాయంతో దూరమయ్యాడు. 2022   సీజన్లోనూ ఇదే రిపీట్ అయింది. ఇక ఇప్పుడు 2023 సీజన్లో కూడా గాయం కారణంగా మళ్ళీ సన్రైజర్స్ కు దూరం అయ్యాడు. ఏదేమైనా వాషింగ్టన్ సుందర్ దూరం కావడం అటు సన్రైజర్స్ జట్టుకు పెద్ద షాకే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: