ఐపీఎల్ హిస్టరీలో డేంజరస్ ప్లేయర్.. కానీ ఇప్పుడు పిల్లిగా మారాడు?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో చివరి వరకు పోరాడివోడిన కోల్కతా జట్టు.. ఆ తర్వాత మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన విజయాలను సాధించింది. దీంతో కోల్కతా మంచి ఫామ్ లోకి వచ్చిందని.. ఇక తిరుగు ఉండదని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆట తీరు పూర్తిగా గాడి తప్పింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా రెండు విజయాల తర్వాత  నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది కోల్కతా జట్టు. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది.



 అయితే ఐపీఎల్ హిస్టరీలో భయంకరమైన ప్లేయర్ గా పేరు సంపాదించుకున్న ఆండ్రీ రసల్ ఆట తీరు మాత్రం పూర్తిగా గాడి తప్పింది. ఎందుకంటే ఎప్పుడు బ్యాటింగ్ చేసిన కూడా విధ్వంసకరమైన ఆట తీరుతో ప్రత్యర్ధులను భయపెడుతూ ఉండేవాడు ఆండ్రూ రసెల్. కానీ ఈ ఏడాది మాత్రం అతను పూర్తిగా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆండ్రూ రస్సెల్ ఒక్క మ్యాచ్ లోను భారీ ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు.



 ఒక రకంగా చెప్పాలంటే ఎంతో డేంజరస్ ప్లేయర్ రస్సెల్ కాస్త ఇక ఇప్పుడు టీం కి భారంగా మారిపోయాడు అని చెప్పాలి. అయితే కోల్కతా గెలిచిన రెండు మ్యాచ్లలో కూడా రస్సెల్ భాగస్వామ్యం శూన్యం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన రస్సెల్ ఈ సీజన్ ఆరంభానికి ముందు 190 స్ట్రైక్ రేట్ గా ఉంటే ఇప్పుడు 175కు పడిపోయింది. ఏడు మ్యాచుల్లో మొత్తం కలిపి 107 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఫినిషర్ గా జట్టుకు అక్కరకు వస్తాడు అనుకుంటే అతనే కొంపముంచేస్తున్నాడు. ఇక కెప్టెన్ నితీష్ రానా రస్సెల్ కు బౌలింగ్ ఇచ్చి సాహసం చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: