వికెట్ కీపర్ గా ధోని ఉండటం.. నిజంగా అదృష్టం?

frame వికెట్ కీపర్ గా ధోని ఉండటం.. నిజంగా అదృష్టం?

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్ లలో మహేంద్రసింగ్ ధోనీ పేరే ముందు వరుసలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ధోని తన వికెట్ కీపింగ్ తో ఎంతలా ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే ఏకంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు ధోని వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్నాడంటే క్రీజు దాటి బయటకు వెళ్లడానికే భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ ధోని వికెట్లను గిరాటేసి అప్పీల్ చేశాడు అంటే.. ఇక తాము అవుట్ అయిపోయాము అని ఫిక్స్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 అంతలా తన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు వికెట్ల వెనకాల ఉంటూ తన కెప్టెన్సీ తో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పటికీ ఇలా వికెట్ కీపర్ గా కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అవుతూనే ఉన్నాడు మహేంద్రుడు. ఈ క్రమంలోనే ధోని వికెట్ కీపర్ గా ఉండడం నిజంగా మా అదృష్టం అంటూ చెబుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న డేవన్ కాన్వే. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.


 అయితే బెంగళూరు జట్టుపై చెన్నై గెలవడంపై సంతోషం వ్యక్తం చేసాడు చెన్నై బ్యాట్స్మెన్ డేవన్ కాన్వే. కెప్టెన్ ధోనిపై కూడా ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా ధోని జట్టును నడిపిస్తున్న తీరు నిజంగా అద్భుతంగా ఉంది. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని డూప్లెసిస్, మాక్స్వెల్ కొట్టిన క్లిష్టమైన క్యాచులను అందుకున్నాడు. అంత చీకటిలో అంత ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడం అంత సులభమైన కాదు. అందుకే ధోని వికెట్ కీపర్ గా ఉండడం నిజంగా మా అదృష్టం అంటూ డేవన్ కాన్వే ప్రశంసించాడు. కాగా వరుస విజయాలు సాధిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: