సెంచరీతో.. చరిత్ర సృష్టించిన వెంకటేష్ అయ్యర్?
అయినప్పటికీ అటు కోల్కతా జట్టు విజయం సాధించలేకపోయింది. కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం అతనికి వరించింది అని చెప్పాలి. కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేసి చెలరేగిపోయాడు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్. ముంబై బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టు ఓడిపోయిన తను ఇన్నింగ్స్ తో ప్రేక్షకుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. అయితే ఇక ఇటీవలే ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేయడం ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు వెంకటేష్ అయ్యర్.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు అని చెప్పాలి. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో మెకాళ్లమ్ కోల్కతా జట్టు తరఫున సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఎంతోమంది ప్లేయర్లు జట్టులోకి వచ్చారు.. పోయారు. కాని ఒకరు కూడా సెంచరీ చేయలేకపోయారు. కానీ దాదాపు 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత వెంకటేష్ అయ్యర్ కోల్కతా జట్టు తరఫున ఆడి సెంచరీ చేశాడు అని చెప్పాలి. 51 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో మెరుపు సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇక అతను సూపర్ సెంచరీపై ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.