అతన్ని పక్కన పెట్టొద్దు.. వరల్డ్ కప్ గెలిపిస్తాడు.. రికీ పాంటింగ్ సూచన?

praveen
టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ ఎంత విధ్వంసకరమైన ఆటగాడో అన్న విషయం క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు తన ఇన్నింగ్స్ లతోనే అది నిరూపించుకున్నాడు సూర్యకుమార్. అంతేకాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అద్భుతంగా షాట్లు ఆడుతూ ఇక ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న పిచ్ లపై కూడా అటు సూర్య కుమార్ యాదవ్ పరుగుల వరద పారించిన  సందర్భాలు చాలానే ఉన్నాయి.

 ఇలా తన అసాధారణమైన ఆటతీరుతో ఏకంగా టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కూడా స్థానం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్లో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అతని ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అతను కేవలం టి20 ఫార్మాట్ కి మాత్రమే సరిపోతాడని.. వన్డే ఫార్మాట్ కి పనికిరాడు అంటూ కొంతమంది విమర్శలు చేయడం చూశాము. అయితే ఇక పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సూర్య కుమార్ కు మద్దతుగా నిలిచాడు ఆస్ట్రేలియా మాజీ రికీ పాంటింగ్.

 బీసీసీఐ ప్రస్తుత సమయంలో సూర్య కుమార్కు మద్దతుగా నిలవాలి అంటూ సూచించాడు. అతను ప్రపంచకప్ గెలిపించగల ఆటగాడు అంటూ అభిప్రాయపడ్డాడు రికీ పాంటింగ్. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్లలోనూ  సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో సూర్య ఏం చేయగలడు ప్రపంచం మొత్తానికి తెలుసు. టీమిండియా సూర్యతోనే వెళ్లాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అతను ప్రపంచకప్ గెలిపించగల ఆటగాడు. బ్యాటింగ్ లో కాస్త నిలకడ లేకపోవచ్చు. కానీ ఎక్కువ సందర్భాల్లో గెలిపించగల సామర్థ్యం ఉన్న క్రికెటర్ అతనే. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ అవకాశాలు ఇస్తే ఒంటి చేత్తో విజయాన్ని అందించగలరు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: