వామ్మో ఆ అరుపులేంటి.. ధోని క్రేజ్ చూసి.. నా మైండ్ బ్లాక్ అయింది?

praveen
సాధారణంగానే భారత్లో క్రికెట్ కి క్రేజ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎంతోమంది స్టార్ క్రికెటర్లకు భారీగానే అభిమానులు ఉంటారు. కానీ ఒక మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం అభిమానులు కాదు ఏకంగా భక్తులు ఉంటారు. ధోని టీవీలో కనిపించాడు అంటే చాలు ఏకంగా హారతి ఇచ్చే అభిమానులు కొంతమంది అయితే.. ధోని కనిపిస్తే చాలు కాళ్ళ మీద పడిపోయే అభిమానులు మరి కొంతమంది. ఇక ధోనితో సెల్ఫీ తీసుకునేటప్పుడు ఏకంగా చెప్పులు విప్పి మరీ గౌరవించేవారు మరి కొంతమంది.


 ఇలా చెప్పుకుంటూ పోతే దోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.  19 ఏళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ నుంచి కూడా తప్పుకుంటాడు అంటూ ప్రచారం జరుగుతుంది.  దీంతో అభిమానులందరికీ ఈ సీజన్ ఎంతో ఫేవరెట్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ భారీ అంచనాలు మధ్య ఐపీఎల్లో ప్రస్తానాన్ని మొదలుపెట్టి మొదటి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.


 చివర్లో వచ్చిన ధోని ఒక ఫోర్ ఒక సిక్సర్  కొట్టి అభిమానులను అలరించాడు. అయితే ఆ తర్వాత సొంత మైదానంలో మాత్రం లక్నోతో జరిగిన మ్యాచ్లో చివర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.  అయితే ఇక చపాక్ స్టేడియంలో ధోని క్రేజ్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని.. ఇక ధోని అభిమానుల అరుపులతో నా చెవులు పగిలిపోయాయి అంటూ లక్నో జట్టులో బౌలర్ గా ఉన్న మార్క్ వుడ్ ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. ధోనిని అవుట్ చేసేందుకు కెప్టెన్ రాహుల్ నేను ప్లాన్ వేసాం. ఇక నేను బంతి ఎక్కడ వెయ్యాలో అక్కడే వేశాను. ఊహించినంత బౌన్స్ కూడా వచ్చింది. కానీ ఆ బంతిని ధోని ఎంతో సునాయాసంగా బౌండరీ  బయట పడేసాడు. ఇక అంతకుముందు మహేంద్రసింగ్ ధోని మైదానంలోకి వస్తుంటే అభిమానుల కేకలు, గోల ఆశ్చర్యంగా అనిపించింది. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడలేదు. ఇక ధోని అభిమానుల అరుపులకి నా చెవులు పగిలిపోయాయి. నేను కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ అయి ధోనిని తక్కువ అంచనా వేశా అని అర్థమైంది అంటూ మార్కు వుడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: