భారత పిచ్ లపై.. ఆడటం పెద్ద కష్టమేం కాదు : కేఎస్ భరత్
ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో కూడా కె ఎస్ భరత్ జట్టులో చోటు రావటం ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే స్వదేశీ పిచ్ లపై ఎలా పరుగులు రాబట్టాలి అనే విషయంపై కె ఎస్ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాట్ సెలక్షన్ సరిగా ఉన్నప్పుడు రన్స్ వాటంతట అవే వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. భారత పిచ్ లపై ఆస్ట్రేలియా మీడియా మాజీ క్రికెటర్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ పిచ్ ల మీద అంత కష్టమేమీ కాదు అంటూ తెలిపాడు కె.ఎస్ భరత్.
భారత పిచ్ లపై పరుగులు రాబట్టాలి అంటే షాట్ సెలక్షన్ అనేది ఎంతో కీలకము. ఇక షాట్ సెలక్షన్ సరిగా ఉన్నప్పుడు పరుగులు వాటంత అవే వస్తాయి. అదే సమయంలో భారత గడ్డపై రాణించాలి అంటే డిఫెన్స్ ను నమ్ముకోవడం ఎంతో ముఖ్యం అంటూ కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ తనకు ఎంతగానో మద్దతుగా నిలుస్తున్నాడు అంటూ కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. అయితే కీపింగ్ లో పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు కే.ఎస్ భరత్. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్లో ఆయన అతను బ్యాట్ ఝలిపించి పరుగులు రాబడతాడో లేదో చూడాలి మరి.