కేఎల్ రాహుల్ వైఫల్యం.. కోచ్ ద్రవిడ్ ఏమన్నాడో తెలుసా?
ఒక్క మ్యాచ్లో సరిగ్గా రానించకపోతేనే తర్వాత మ్యాచ్లో అతనిపై వేటు వేసే సెలెక్టర్లు.. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతూ ఉన్నప్పటికీ ఎందుకు అతనికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు అన్నది మాత్రం అందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతున్న గిల్ లాంటి ఆటగాళ్లను కేఎల్ రాహుల్ స్థానంలో రీప్లేస్ చేస్తే బాగుంటుందని కొంతమంది బీసీసీఐ సెలెక్టర్లకు సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే అటు కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే కేఎల్ రాహుల్ పై ఘాటు విమర్శలకు కూడా దిగుతూ ఉన్నారు.
అయితే వరుసగా ప్రతి మ్యాచ్లో విఫలం అవుతూ ఉన్నప్పటికీ ఇంకా కేఎల్ రాహుల్ను జట్టులో కొనసాగిస్తూ ఉండడంపై టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ పై విమర్శలు వస్తున్న వేళ రాహుల్ ద్రావిడ్ మాత్రం అతనికి అండగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం అనేది ప్రతి ఆటగాడి జీవితంలో ఒక దశమాత్రమే. విదేశీ టూర్లలో సక్సెస్ఫుల్ ఓపెనర్లలో రాహుల్ కూడా ఒకడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టూర్లలో సెంచరీలు బాదాడు. అందుకే అతనికి మద్దతు ఇస్తూనే ఉంటాం అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.