అంతా తూచ్.. టీమిండియా నెంబర్.1 కాదట?

praveen
సాధారణంగా ఐసిసి ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ర్యాంకుల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకుంటూ ఉంటుంది. కానీ గత కొంత కాలం నుంచి ర్యాంకుల విషయంలో ఐసీసీ పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రెండవ స్థానంలో ఉన్న టీమ్ ఇండియాను ఐసీసీ నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటూ ప్రకటించింది. కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకొని టీమిండియా రెండవ స్థానంలో ఉంది అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి.


 అయితే ఒక్కసారి అయితే పర్వాలేదు. కానీ ఐసీసీ మరోసారి ఇలాంటి పొరపాటున చేసింది. ఇటీవలే మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్ ను ప్రకటించగా టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పాలి. దీంతో ఇక భారత అభిమానులు అందరూ కూడా సంబరపడిపోయారు. ఎందుకంటే ఇప్పటికే వన్డే టీ20 ఫార్మట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా  టెస్ట్ ఫార్మాట్లో కూడా అగ్రస్థానంలోకి వచ్చిందని ఏకకాలంలో ఇలా మూడు ఫార్మర్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఏకైక జట్టు టీమ్ ఇండియా అని ఎంతోమంది ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు.


 ఇలాంటి సమయంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరోసారి ట్విస్ట్ ఇచ్చింది. అంతా తూచ్ భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో కాదు.. రెండో ర్యాంకులోనే కొనసాగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది. తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతోనే ఈ గందరగోళం చోటుచేసుకుంది అంటూ ఇటీవల వివరణ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 126 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉండగా.. భారత్ 115 రేటింగ్ పాయింట్లతో రెండవ స్తానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే టీమిండియా మొదటి స్థానంలోకి ఏకబాకినట్లు వార్తలు రావడంతో  కెప్టెన్ రోహిత్ శర్మ ఏ ఇండియన్ కెప్టెన్కు సాధ్యం కానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు అంటూ ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: