ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్.. ఆస్ట్రేలియాకు మొదలైన టెన్షన్?

praveen
ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ ఆతిధ్య టీమిండియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు వరకు ఎంతో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా జట్టు ఇక భారత్లో ఉన్న పీచ్ లపై మాత్రం పూర్తిగా తేలిపోతోంది. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి ఎంతో కష్టపడి పోతున్న మైదానంలోనే అటు భారత బ్యాట్స్మెన్లు మాత్రం వీర విహారం చేస్తూ పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది టీం ఇండియా.


 ఈ క్రమంలోనే 132 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం భారత జట్టుకు ఎంతో కీలకం. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనె ప్రతి మ్యాచ్ లో కూడా గెలవడమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది టీమ్ ఇండియా. అయితే ఇక ఈ నెల 17వ తేదీన ఢిల్లీ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ అటు ఆస్ట్రేలియాను టెన్షన్ పెడుతుంది అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే ఢిల్లీ స్టేడియంలో అటు టీమిండియా రికార్డులు చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి. దాదాపు గత 36 ఏళ్లుగా ఢిల్లీలో ఏ విదేశీ జట్టు కూడా గెలవలేదు. ఇప్పటివరకు ఢిల్లీలో 34 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఇక ఇందులో 13 మ్యాచులు గెలిచింది టీం ఇండియా. ఆరు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది. గతంలో ఆస్ట్రేలియా ఇదే స్టేడియంలో ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడగా ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది.  అది కూడా 1959 లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇలా టీమిండియా కు బాగా అచ్చొచ్చిన మైదానంలో మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఆస్ట్రేలియాలో టెన్షన్ మొదలైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: