క్రికెట్ వదిలేద్దామనుకుంది.. కానీ వేలంలో భారీ ధర పలికింది?

praveen
ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతుంది జేమియా రోడ్రిక్స్. ఇక ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో కూడా భారీ ధర పలికింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇక తన కెరియర్ లో జరిగిన ఎన్నో కఠినమైన విషయాలను కూడా ఇటీవల చెప్పుకోవచ్చింది. వన్ డే మహిళల ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించడం తన జీవితం  లోనే అత్యంత కఠినమైన దశ అంటూ భారత బ్యాట్స్మెన్ జేమియా రోడ్రిక్స్ చెప్పుకొచ్చింది.


 ఆ సమయం లో ఎంతగానో బాధపడ్డానని.. ఏకంగా క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా భావించాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే పాకిస్తాన్తో టి20 ప్రపంచ కప్ ఆరంభ పోరులో జేమియా రోడ్రిక్స్ 53 పరుగులు చేసి అజయమైన హాఫ్ సెంచరీ తో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహించింది. అలాంటి సమయంలో ఇక వన్డే ప్రపంచ కప్ జట్టు నుంచి నన్ను తప్పించడం అగమ్య గోచరంగా అనిపించింది.  ఇక ఆ సమయంలో కెరియర్లో ముందుకు వెళ్లే శక్తి కూడా తగ్గిపోయింది. కానీ ఎంతో మంది స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు అంటూ చెప్పుకొచ్చింది.


 అయితే ఇలా ఒకప్పుడు జట్టులో చోటు కోల్పోయి కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిద్దాం అని డిసైడ్ అయిన జేమియా రోడ్రిక్స్ కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేపథ్యం లో జరిగిన  వేలం లో భారీ ధర పలికింది అని చెప్పాలి. ఏకంగా ఈ స్టార్ బ్యాటర్ ను సొంతం చేసుకున్నందుకు ఎన్నో ఫ్రాంచైజీలు  పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2.2 కోట్ల ధరకు జమీయ జేమియా రోడ్రిక్స్ ను దక్కించుకుంది అని చెప్పాలి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈ స్టార్ బ్యాటర్ ప్రస్తానం ఎలా కొనసాగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: