హెయిర్ కట్ సరిగా చేయలేదని.. రూ.2 కోట్ల ఫైన్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా ఘటనలు సినిమాల్లోనే అనుకున్నాం.. ఇక నిజజీవితంలో కూడా జరుగుతాయా అనే ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.


 సాధారణంగా ఆడవారైనా మగవారైనా సరే వారి జీవితంలో హెయిర్ కట్ చేపించుకోవడం సర్వసాధారణం. డబ్బులు లేని వారు దగ్గరలో ఉన్న సెలూన్ కు వెళ్తే.. ఇక డబ్బులు ఉన్నవారు కాస్త ఖర్చు ఎక్కువగా పెట్టి ఆయన కాస్లీ సెలూన్లను ఆశ్రయిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా భారీగా ఖర్చుపెట్టి మరి తమకు నచ్చినట్టుగా హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఇలా హెయిర్ స్టైలిష్టులుగా చాలామంది గట్టిగానే సంపాదిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం మనం అనుకున్నట్లుగా హెయిర్ స్టైల్ కుదరదు. ఇలా జరిగినప్పుడు నెక్స్ట్ టైం మాత్రం జాగ్రత్తగా హెయిర్ కట్ చేయించుకోవాలని అందరూ అనుకుంటారు.


 కానీ ఇక్కడొక మహిళ మాత్రం అలా అనుకోలేదు. తనకు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు అన్న కారణంతో రెండు కోట్ల జరిమానా విధించడం గమనార్హం.  ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఐటిసి మౌర్య హోటల్లోని సెలూన్ కు ఎన్సిడి ఆర్సి రెండు కోట్ల జరిమానా విధించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నష్టపరిహారం అంత ఇవ్వడానికి గల కారణాలు తమకు కనిపించడం లేదు అంటూ మరోసారి విచారణ చేపట్టాలంటు సూచించింది. 2018 లో మోడల్ అష్ణా రాయ్ ఐటిసి మౌర్యాలో హెయిర్ కట్ చేయించుకోగా సరిగా హెయిర్ కట్ చేయలేదంటూ ఆమె ఎన్సీడీ ఆర్సీలో ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్సీడీ ఆర్సి సెలూన్ కు రెండు కోట్ల పైన్ విధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: