మూడో వన్డే మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ సెంచరీ?
ఈ క్రమంలోనే గత ఏడాది ఇక మూడు ఫార్మాట్లలో కూడా సెంచరీ చేసి తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇక మొన్నటికి మొన్న కొత్త ఏడాదిలో కూడా మరో సెంచరీ తో చెలరేగి రికార్డుల వేటను ప్రారంభించాడు అని చెప్పాలి. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే శ్రీలంకలో జరుగుతున్న వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు నేడు జరగబోయే మూడో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది అని చెప్పాలి.
అయితే మూడో వన్డే మ్యాచ్లో కూడా అటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అంటూ భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. మూడో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 30 పరుగుల స్కోర్ చేశాడు అంటే చాలు ఇక ఆ తర్వాత బ్యాటింగ్ లో చేలరేగి సెంచరీ చేయడం ఖాయం అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ 40, 50 పరుగులు చేసిన తర్వాత వికెట్ సమర్పించుకునే ఆటగాడు కాదు మంచి ఆరంభం దొరికింది అంటే కచ్చితంగా భారీ స్కోరుగా మలిచి సెంచరీ సాధిస్తాడు అంటూ వసిం జాఫర్ చెప్పుకొచ్చాడు.