అతన్ని ఎందుకు తీసుకోలేదు.. సెలక్షన్ కమిటీపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి?

praveen
ఫిబ్రవరి నెల చివరిలో ఆస్ట్రేలియాతో భారత్ వేదికగా జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక అటు భారత జట్టు ఇటీవల పూర్తి జట్టు  ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ లో ఎంతోమంది యువ ఆటగాళ్లు టెస్ట్ జట్టులో అరంగేట్రం చేయబోతున్నారు అని చెప్పాలి. ఇక మొన్నటి వరకు వన్డే టి20 ఫార్మాట్ లో అదరగొట్టిన ఆటగాళ్లు ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో కూడా తమ సత్తా ఏంటో నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇక బిసిసిఐ ఇలా ఆస్ట్రేలియాతో తలబడబోయే టెస్ట్ సిరీస్ కు సంబంధించిన జట్టు వివరాలు ప్రకటించిన తర్వాత మాత్రం ఒకే ఒక విషయం అందరిని హర్ట్ చేస్తుంది. ఇక ఈ విషయంపై ఎంతో మంది స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. అదేంటో కాదు సర్పరాజు ఖాన్ ను ఎంపిక చేయకపోవడం. ఇక ఇటీవల మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. దేశవాళీ టోర్నీ అయినా రంజీ ట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఇక టెస్టు జట్టును ఎంపిక చేయాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్.


 ఆస్ట్రేలియాతో ఆడబోయే టెస్ట్ జట్టులో 17 మంది ఆటగాల్లను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అయితే ఈ లిస్టులో రంజీలో భారీ స్కోర్ నమోదు చేస్తూ గత రెండేళ్ల నుంచి నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ కు చోటు దక్కకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. రంజీల్లో సర్ఫరాజ్ 2020- 21, 2021- 22లలో వరుసగా 928, 982 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కొనసాగుతున్న రంజీ ట్రోఫీలో సర్పరాజు ఇప్పటికే 431 పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడు ప్రదర్శననుపరిగణలోకి తీసుకోకుండా జట్టు నుంచి పక్కన పెట్టడం సరికాదు అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: