ఆ ఇద్దరితోనే వరల్డ్ కప్ గెలవలేం : కపిల్ దేవ్

praveen
2023 ఏడాదిలో భారత్ వేదికలో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో మాత్రం సత్తా చాటి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదింపాలని టీమిండియా భావిస్తుంది. ఇందుకోసం ఇక కొన్ని నెలల ముందు నుంచి ఎంతో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది అని చెప్పాలి.


 అయితే ఇక ఈసారి వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల పైన ఆధారపడితే మాత్రం వరల్డ్ కప్ గెలవడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు . ఇద్దరు ముగ్గురు సీనియర్ల పైన ఆధారపడటం కాదు. దాదాపు అయిదారు గురు మ్యాచ్ విన్నర్లను మనం తయారు చేసుకోవాలి. ప్రపంచకప్ గెలవాలంటే కోచ్ సెలెక్టర్లు టీ మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.


 వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి ఇక జట్టు ప్రయోజనాల పైన ఎక్కువగా ఆలోచించాలి అంటూ కపిల్ దేవ్ సూచించాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతోనే వరల్డ్ కప్ గెలిచేస్తాము అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు. జట్టుపై మీకు నమ్మకం ఉండాలి. అలాంటి జట్టు మనకు ఉందా అంటే.. మన వద్ద ప్రపంచకప్ గెలిపించే ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు స్వయంగా ముందుకు వచ్చి పెద్ద వేదికలపైబాధ్యత తీసుకొని ఆడాలని సూచించాడు.  ఇక ప్రతి ఒక్క ఆటగాడు కూడా మా సమయం వచ్చింది అనుకొని అద్భుతంగా రాణించాలి అంటూ కపిల్ దేవ్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: