హార్దిక్ కు కెప్టెన్సీ ఏంటి.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్?

praveen
కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం వేడుకలను ముగించుకుని ఇక ఇప్పుడు నిర్విరామంగా క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో ఇక రేపటి నుంచి టి20 సిరీస్ ఆడబోతుంది టీమ్ ఇండియా జట్టు. టి20 సిరీస్ లో భాగంగా పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే .


 కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉండగా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రాహుల్ కూడా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి సూర్య కుమార్ యాదవ్ కు వైస్ కెప్టెన్సీ ఇస్తూ  నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి  అయితే హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించడం బీసీసీఐ తీసుకున్న మంచి నిర్ణయం అంటూ ఎంతో మంచి మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే అతను జట్టుకు టైటిల్ అందించాడు  అతను టీమిండియాని కూడా సమర్థవంతంగా నడపగలడు అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  కానీ భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ మాత్రం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై భిన్నంగా స్పందించాడు. అతనికి కెప్టెన్సీ అప్పగించే ముందు బీసీసీఐ ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. హార్థిక్ పాండ్యాలో అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయ్ అనడంలో సందేహం లేదు. మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ కు సారధిగా టైటిల్ కూడా అందించాడు. కానీ అతని దీర్ఘకాలికి కెప్టెన్ గా నియమించాలనుకుంటే మాత్రం అది అతను ఫిట్నెస్ పై దృష్టి  సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫిట్నెస్ చాలా కీలకంగా కానుంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: