డేవిడ్ కాన్వే అరుదైన రికార్డ్.. తొలి కివిస్ బ్యాటర్?

praveen
ప్రస్తుతం పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ కాన్వే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. టెస్టులలో న్యూజిలాండ్ తరపున అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా డేవిడ్ కాన్వె నిలిచాడు అని చెప్పాలి. తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు డేవిడ్ కాన్వే.

 ఈ క్రమంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి ఇక న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఓ అరుదైన రికార్డు సాధించాడు. కాగా ఇప్పుడు వరకు రీడ్ ఇరవై ఇన్నింగ్స్ లలో 1000 పరుగుల మార్క్ అందుకోగా డేవిడ్ కాన్వే మాత్రం కేవలం 19 ఇన్నింగ్స్ లోనే ఈ అరుదైన ఘనత సాధించడం గమనార్ధం. కాగా ఇప్పటివరకు టెస్టులలో కాన్వే అత్యుత్తమ స్కోర్ 200 కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు కాన్వె ఖాతాలో మూడు శతకాలు ఐదు అర్ద శతకాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా అరుదైన రికార్డు సృష్టించిన కాన్ ను వె ఒక్క విషయం మాత్రం నిరాశకు గురి చేసింది అని చెప్పాలి.

 పాకిస్తాన్తో మ్యాచ్లో భాగంగా సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు డేవిడ్ కాన్వే. మూడో రోజు ఆటలో భాగంగా నౌముల్ బౌలింగ్లో  ఎల్ బి డబ్ల్యూ గా వెనుదిరిగాడు అని చెప్పాలి. దీంతో 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతని ఇన్నింగ్స్ కి తెరపడింది. తద్వారా ఇక 8 పరుగుల దూరంలో కీలకమైన టెస్ట్ సెంచరీని మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక టెస్టులలో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్క్ అందుకున్న రికార్డు హార్బర్ట్ సట్ క్లిప్ పేరిట ఉంది అని చెప్పాలి. కేవలం 12 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 1925లో ఆస్ట్రేలియాపై ఈ ఘనతసాధించాడు హర్బర్ట్ సట్ క్లిప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: