బంగ్లాదేశ్ పై విజయం.. రోహిత్ కు సాధ్యం కానీ రికార్డ్ రాహుల్ సొంతం?
అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ కు అటు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం బారిన పడి దూరం అయిన నేపథ్యంలో.. ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ సారాధ్య బాధ్యతలను చూసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతని కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఇదిలా ఉంటే ఇక ఇటీవల బంగ్లాదేశ్ పై మొదటి టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ గా విజయాన్ని అందించిన కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. విదేశాల్లో మూడు ఫార్మాట్లలో కూడా టీమ్ ఇండియాను గెలిపించిన 5వ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు కేఎల్ రాహుల్. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే మాత్రమే టి20 వన్డే టెస్ట్ ఫార్మట్లలో టీమ్ ఇండియా కెప్టెన్గా వ్యవహరించి విజయాలను అందించారు.
ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పాలి. ఇప్పటివరకు రోహిత్ శర్మ మూడు ఫార్మట్ లలో టీమ్ ఇండియాకు విదేశీ గడ్డపై విజయాన్ని అందించలేదు. కాగా జింబాబ్వే పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ గెలిపించాడు. ఒక ఆసియా కప్ లో రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో టి20 మ్యాచ్ లో విజయం అందించాడు. బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్ మ్యాచ్లో విజయం అందించడంతో మూడు ఫార్మాట్లలో టీమిండియా కు కెప్టెన్గా విజయం అందించిన ప్లేయర్ గా మారిపోయాడు. కాగా టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ కెప్టెన్ గా ఇప్పటివరకు విదేశీ గడ్డపై ఒక్క మ్యాచ్ కి కూడా సారధ్యం వహించలేదు.