రోహిత్ రీ ఎంట్రీ.. వద్దే వద్దంటూనే ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా భారత ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగిపోయారు. పూజారా సెంచరీ చేయగా.. మరోవైపు యువ ఆటగాడు శుభమన్ గిల్ సైతం తన కెరియర్ లో మొదటి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శుభమాన్ ప్రతిభపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 152 బంతులు ఆడి 10 ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శుభమన్ గిల్. ఇదిలా ఉంటే ఇటీవల ఒక వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  బంగ్లాదేశ్తో జరగబోయే రెండవ టెస్ట్ కి రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడు అన్నది తెలుస్తుంది. రోహిత్ శర్మ ఆడితే శుభమన్ గిల్ బెంచ్ కి పరిమితం కావాల్సిందే. ఇలా సెంచరీ చేసి జట్టును గెలిపించిన ఆటగాడిని పక్కన పెట్టడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా అభిమానులు.  మూడో స్థానంలో పూజార, 4, 5 స్థానంలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఇక రోహిత్ రీఎంట్రీ కారణంగా ఎటోచ్చి గిల్ స్థానానికి ఎసరు పడేలా కనిపిస్తూ ఉంది.


 ఇలాంటి పరిణామాల నేపథంలో మొదటిసారి రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి రోహిత్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన బాగా రాణిస్తాడు అన్న నమ్మకం మాత్రం లేదు. అలాంటి సమయంలో ఇక ఇటీవల సెంచరీ తో చెలరేగిపోయి అదరగొట్టి ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహించిన శుభమన్ గిల్ ను రోహిత్ కోసం పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీంతో రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వకపోతే బాగుండు అని కొంతమంది టీమ్ ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: