ఐపీఎల్ లో కొత్త రూల్.. కేవలం వాళ్లకే వర్తిస్తుందట?
అంతేకాకుండా సరికొత్త రూల్స్ ని ఐపీఎల్ లో అమలు చేయాలని భావిస్తూ ఉంది. అయితే ఇప్పటికే బీసీసీఐ దేశవాలి క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ అమలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ రూల్ ప్రకారం సబ్ ఇన్స్టిట్యూట్ గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ చేయడం మాత్రమే కాదు బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.. అయితే నిర్ణీత ఓవర్లలో మాత్రమే ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో ఈ కొత్త రూల్ను తీసుకువచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది.
ఇకపోతే వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఇక ఈ రూల్ ప్రవేశపెట్టడం గురించి స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఇంపాక్ట్ రూల్ ప్రకారం మ్యాచ్ మధ్యలో జట్లు కావాలనుకుంటే ప్లేయింగ్ 11 లోని ఒక ఆటగాడిని సబ్స్టిట్యూట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం భారత ఆటగాళ్లకి మాత్రమే వర్తిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. ఒక భారత ఆటగాడి స్థానంలో మరో స్వదేశీ ఆటగాడిని మాత్రమే రీప్లేస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ తెలిపింది. ఇకపోతే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఐపిఎల్ లో ఎలా ఉపయోగించుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.