వావ్.. సిక్సర్లలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సిక్సర్ల వీరుడు అని ఒక అరుదైన బిరుదు ఉంది అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఓపెనర్ గా బరిలోకి దిగే రోహిత్ శర్మ ఎంతో అలవోకగా బంతిని బౌండరీకి తరలించడంలో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ముఖ్యంగా భారీ సిక్సర్లు కొట్టడంలో ఇక రోహిత్ శర్మకు ఎవరు సాటిరారేమో అని అనిపిస్తూ ఉంటుంది   ఇప్పుడు వరకు రోహిత్ శర్మ చేసిన స్కోర్ లలో ఎక్కువగా సిక్సర్ల ద్వారా వచ్చిన పరుగుల ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అందుకే టీమిండియా అభిమానులు అందరూ కూడా రోహిత్ శర్మను సిక్సర్ల వీరుడు అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఓపెనర్ గా  బరిలోకి దిగుతూ చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు అని చెప్పాలి. కానీ ఇటీవల రెండో వన్డే మ్యాచ్లో మాత్రం చేతికి గాయం అయినప్పటికీ కూడా చివర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయతీరాల వైపుకు నడిపించాడు. కానీ మరోవైపు నుంచి సహకారం లేకపోవడంతో చివరికి టీమిండియా ఓడిపోయింది


 అయితే ఇక రెండో వన్డే మ్యాచ్లో రోహిత్ కొట్టిన సిక్సర్ల  కారణంగా రోహిత్ శర్మ ఒకరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 500 సిక్సర్లు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ. కాగా ఈ లిస్టులో విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్ లో 553 సిక్సర్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. హిట్ మాన్ రోహిత్ శర్మ 445 ఇన్నింగ్స్ లోనే 502 సిక్సర్లు కొట్టాడు.. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ 508 ఇన్నింగ్స్ లలో 476 ఇన్నింగ్స్.. మేకళ్ళమ్ 478 ఇన్నింగ్స్ లో 398 సిక్సులు.  న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ 402 ఇన్నింగ్స్ లో 382 సిక్సర్లతో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: