సూర్య భాయ్.. ఇది పేరు కాదు బ్రాండ్.. ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావ్?

praveen
గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతున్న పేరు ఏదైనాఉంది అంటే అది సూర్య కుమార్ యాదవ్ అనే పేరు అని చెప్పాలి. ఈ టీమిండియా బ్యాట్స్మెన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను చేస్తున్నాడు. తన 360 డిగ్రీస్ ఆట తీరుతో మాజీ ఆటగాళ్లను సైతం తనకు అభిమానులుగా మార్చుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఎక్కడ భయం బెరుకు లేకుండా ఎంతో స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ క్రికెట్ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు అని చెప్పాలి.


 దీంతో గత కొంతకాలం నుంచి సూర్య కుమార్ యాదవ్ ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే అందరితో పోల్చి చూస్తే కాస్త ఆలస్యంగానే భారత జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ ఇక తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా ఎదిగాడు సూర్యకుమార్. న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగాడు. దీంతో సూర్య భాయ్ ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


 కాగా ముంబై కి చెందిన సూర్య కుమార్ యాదవ్ 2010- 11 రంజి సీజన్లో కెరియర్ స్టార్ట్ చేశాడు అని చెప్పాలి. అయితే చాలాసార్లు ముంబై తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు సూర్య కుమార్. 2012లో ఐపీఎల్లోకి అరం గేట్రం చేసిన సూర్యకుమార్ మంచి ప్రదర్శన చేసిన టీమిండియాలోకి వచ్చేందుకు మాత్రం చాలానే సమయం పట్టింది. 2021లో 31 ఏళ్ల వయసులో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఏడాది తిరగకముందే ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు సూర్యకుమార్. దీంతో రానున్న రోజుల్లో భారత క్రికెట్ ఫ్యూచర్ అతడే అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: