RCB ఒక్కసారి కప్పు గెలిస్తే.. ఇక గెలుస్తూనే ఉంటుంది : ఏబిడి

praveen
సాధారణంగా ఏ లీగ్ లో అయినా సరే ఛాంపియన్ జట్లకే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను మించిన క్రేజ్ సంపాదించుకున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ సారాధ్యంలో బరిలోకి దిగే బెంగళూరు జట్టుకు ఉండే ప్రేక్షకాదరణ అంతా ఇంతా కానీ. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఈ జట్టు. జట్టులో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్న ఎందుకో అదృష్టం మాత్రం కలిసి రాలేదు.


 దీంతో గత ఏడాది ఏకంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొత్తగా  డూప్లెసెస్ ను కెప్టెన్ గా నియమించిన.. ఆ జట్టుకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. గత మూడు సీజన్స్ నుంచి అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న కీలక సమయాల్లో చేతులెత్తేయడంతో ఇక జట్టుకు చేదు అనుభవం తప్పడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపిఎల్ టైటిల్ గెలవడం గురించి ఇక ఆ జట్టుకు 11 ఏళ్ళ పాటు ప్రాతినిథ్యం  వహించిన కీలక ఆటగాడు ఎబి డివిలియర్స్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఇప్పటికీ 15 సీజన్లు పూర్తయ్యాయి అనుకుంటా.. వాళ్లు సవాళ్ళను అధిగమించాలని పట్టుదలగా ఉన్నారు. బెంగళూరు జట్టు ఒక్కసారి కప్పు గెలిచిందంటే వాళ్ళు ఇక వరుసగా రెండు మూడు నాలుగు గెలుస్తూనే ఉంటుంది. టి20 క్రికెట్ అంటేనే అంచనాలను తలకిందులు  చేసే ఫార్మాట్. పొట్టి క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నాకౌట్ మ్యాచులు ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టం. అయితే ఈసారి బెంగళూరు జట్టు ఛాంపియన్గా మారుతుందని ఆశిస్తున్న అంటూ  డివిలియర్స్ చెప్పుకుచ్చాడు. అయితే ఏబి డివిలియర్స్ బెంగళూరు జట్టులోకి ఆటగాడిగా లేకపోతే మెంటర్ గా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్న టాక్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: