రష్మికకు సారీ చెప్పిన వార్నర్.. ఎందుకో తెలుసా?
ఈ క్రమంలోనే ఇలా అభిమానులందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. ఇక స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మార్ఫింగ్ చేసి ఇక హీరోల ముఖాల పేస్ లో తన ముఖాన్ని పెట్టుకొని ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటివరకు ఎంతో మంది హీరోల ముఖాలను తన ముఖంతో మార్ఫింగ్ చేయడం మాత్రమే ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక హీరోయిన్ ముఖాన్ని తన ముఖంతో మార్ఫింగ్ చేసి వీడియోని విడుదల చేశాడు డేవిడ్ వార్నర్.
అది కూడా ఎవరు ముఖమో తెలుసా.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న అందమైన రష్మిక మందన్న ముఖాన్ని తన ముఖంతో మార్ఫింగ్ చేసి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏకంగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని రష్మిక డాన్స్ చేసిన స్టెప్పులను తాను చేసినట్లుగా క్రియేట్ చేశాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసి సో సారీ అంటూ ఒక కామెంట్ కూడా రాసుకోవచ్చాడు డేవిడ్ వార్నర్. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇలాంటి మార్ఫింగ్ చేసి ఏకంగా రష్మికకు వార్నర్ సారీ చెప్పాడు అని ప్రస్తుతం నేటిజన్స్ అందరు అనుకుంటున్నారు.