వరల్డ్ కప్ : 1992 సెంటిమెంట్.. కప్పు గెలిచేది ఆ జట్టే?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల సెల్ఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ లో మరోసారి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంటుందని ఎదురుచూసిన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ టీమిండియా నిరాశ మిగిల్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా ఫైనల్లో అడుగుపెడితే ఇక తప్పకుండా కప్పు గెలుస్తుంది అనుకున్న టీమిండియా మాత్రం ఊహించిన విధంగా సెమీఫైనల్ లో ఓడి ఇక వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.


 దీంతో 1992 వరల్డ్ కప్ సెంటిమెంట్ మరోసారి 2022 వరల్డ్ కప్ లో రిపీట్ కాబోతుంది అన్న చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి పాకిస్తాన్ రెండోసారి టి20 వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. అప్పటివరకు దుమ్ము లేపిన న్యూజిలాండ్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం ఏంటి.. లీగ్ దశలో పడుతూ లేస్తూ సెమీఫైనల్కు వచ్చిన ఇంగ్లాండ్ వరుస విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాని ఓడించడమేంటి అనే ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి.

 ఇంతకీ 1992లో ఏం జరిగిందంటే.. 1992లోనే వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్లు ఫైనల్లో తలబడ్డాయి. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఈ రెండు ఫైనల్ ఆడబోతున్నాయి. ఇక అప్పుడు కూడా  వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే జరిగింది. అయితే ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో చూసుకుంటే పాకిస్తాన్ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిపోయింది.  తర్వాత జింబాబ్వే చేతిలోనూ ఓటమి చవిచూసింది. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో అద్వితీయమైన విజయాలు సాధించింది. సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో అదృష్టం కలిసి వచ్చి సెమిస్ లో అడుగు పెట్టింది. 1992 లోను తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది తర్వాత మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. సెమీఫైనల్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ ను ఓడించింది. ఫైనల్లో మెల్బోర్న్ లో ఇంగ్లాండ్ తో తలబడింది. చివరికి విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: