టీమిండియా ఓటమి.. అతన్ని ఎందుకు ఆస్ట్రేలియా తీసుకెళ్లారంటూ ప్రశ్న?
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఓడిపోయిన నేపథ్యంలో ఎన్నో కారణాలను తెరమీదికి తీసుకువస్తూ అటు భారత జట్టు ప్రదర్శన పై భారత జట్టు సెలక్షన్ కమిటీ పై ముఖ్యంగా రోహిత్ శర్మ వ్యూహాలపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజుకి పెరిగిపోతూనే ఉంది. అయితే మొన్నటికి మొన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలనే టార్గెట్ గా చేసుకుంటూ అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ లో అందరికీ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నామని.. అందుకే దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంతును జట్టులోకి తీసుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
చెప్పినట్లుగానే జింబాబ్వే తో మ్యాచ్ సహా ఇటీవల కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ కు అవకాశాలు ఇచ్చాడు. కానీ అతను పెద్దగా రాణించలేదు. అయితే టీమిండియాలో తెలివైన బౌలర్గా పేరున్న చాహాల్ కు మాత్రం వరల్డ్ కప్ లో ఒక్క అవకాశం దూకు కూడా దక్కలేదు. అతన్ని బెంచ్ కే పరిమితం చేశారు. అక్షర్ పటేల్ స్థానంలో అతని జట్టులోకి తీసుకోవాలని లేదంటే అశ్విన్ స్థానంలో చాహల్ తో రీప్లేస్ చేయాలని ఎంతో మంది సలహా ఇచ్చిన అటు సెలెక్టర్లు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయలేదు. దీంతో అతన్ని సెలెక్ట్ చేయనప్పుడు ఇంకా స్పెషల్ గా ఆస్ట్రేలియా ఎందుకు తీసుకువెళ్లారు. అతనికి ఛాన్స్ ఇచ్చి ఉంటే అశ్విన్ కంటే మెరుగ్గా రాలించేవాడు కదా అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు టీమ్ ఇండియా అభిమానులు.