వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. మ్యాక్స్ వెల్ బూతులు?

praveen
సొంత గడ్డపై టి20 వరల్డ్ కప్ జరిగిన పరికి కూడా ఆస్ట్రేలియా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి  వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సత్తా చాటి మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని  అందరూ భావించారు. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఎగరేసుకు పోతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉండే బౌన్సి పిచ్ లపై మిగతా ఆటగాళ్ల కంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్లకు ఎక్కువ అవగాహన ఉంటుంది. దీంతో ఇలా స్వదేశీ పరిస్థితులు కలిసి వస్తాయి అని అందరూ భావించారు..


 కానీ ఊహించని రీతిలో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమితో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయింది. తర్వాత మ్యాచ్ లలో విజయాన్ని సాధించినప్పటికీ రన్ రేట్ మాత్రం మెరుగుపరచుకోలేకపోయింది. చివరికి ఆ రన్ రేట్ ఆస్ట్రేలియా కొంపముంచింది. ఇటీవల వరల్డ్ కప్ లో గ్రూప్ వన్ లో టాప్ లో ఉన్న న్యూజిలాండ్ సెమీస్ చేరగా ఇక ఏడు పాయింట్లతో  ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. కానీ రన్ రేట్ ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండ్ కు మెరుగ్గా ఉండడంతో ఆస్ట్రేలియా ఇంటికి ఇంగ్లాండ్ సెమీస్ కి వెళ్ళాయి.


 ఇలా సొంత గడ్డపై వరల్డ్ కప్ జరిగిన కూడా కనీసం సెమి ఫైనల్ లో కూడా అడుగుపెట్టకుండానే ఆస్ట్రేలియా వెనుదిరిగింది  అని చెప్పాలి. ఇక ఈ పరాజ్యంపై అటు ఫాన్స్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ చేసిన ట్విట్ మాత్రం వైరల్ గా మారిపోయింది. టోర్నమెంట్ నుంచి వైదొలిగామన్న బాధతో.. అక్కస్సు తో మాక్స్ వెల్ ట్విట్టర్ ఖాతాలో బగ్గర్ అంటూ ఒక బూతు పదాన్ని ట్విట్ చేశాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ఈ ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: