టీమిండియాకు అనుకూలంగా ఐసీసీ.. స్పందించిన రోజర్ బిన్నీ?
వరల్డ్ కప్ లో భాగం గా అంపైర్లు టీమిండియా కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని.. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ సైతం బీసీసీఐకి మద్దతు పలుకుతూ అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటూ కొంతమంది విమర్శలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లలో జరిగిన సంఘటనలు ఉదాహరణగా చూపుతూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు.
ఇక పోతే ఇటీవలే ఇదే విషయంపై స్వయం గా ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి వరల్డ్ కప్ లో భారత్ ను ఎలాగోలా సెమిస్ చేర్చాలని ఐసిసి ప్రయత్నిస్తుంది అంటూ వస్తున్న విమర్శల పై స్పందిస్తూ... విమర్శలు వచ్చిన పర్వాలేదు అంటూ వ్యాఖ్యానించాడు రోజర్ బిన్నీ. ఇండియా లో క్రికెట్ అంటే ఒక పెద్ద పవర్ హౌస్ అని చెప్పుకొచ్చాడు. ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా ఉంది అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు అంటూ తెలిపాడు. ఐసీసీ ప్రత్యేకం గా మాకు సపోర్ట్ చేయడానికి మిగతా జట్లకు భారత్కు తేడా ఏంటి అంటూ ప్రశ్నించాడు రోజర్ బిన్నీ.