వరల్డ్ కప్ నుంచి.. ఆస్ట్రేలియా ఔట్?
ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఇక ఈ ఏడాది కూడా వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని అందరూ భావించారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉండే బౌన్సి పిచ్ లపై ఇక వారికి పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి మిగతా జట్లతో పోల్చి చూస్తే వారే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మిగతా జట్లు బాగా రాణిస్తే ఆస్ట్రేలియా మాత్రం అనుకున్న రీతిలో అంచనాలను అందుకోలేకపోయింది.
ఇక అతి కష్టం మీద ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది అని అందరూ అనుకున్నారు. కానీ రేపు జరిగే ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ పైనే ఇక ఆస్ట్రేలియా భవితవ్యం ఆధారపడి ఉంది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య గత 7 మ్యాచ్ లలో చూసుకుంటే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ విజయం ఖాయం అన్నది తెలుస్తుంది. సొంత గడ్డపై జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇంటి బాట పట్టడం ఖాయం అనేది తెలుస్తుంది.