ప్చ్.. ఏంటి బాబర్ ఇది.. మళ్లీనా?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భాగంగా ప్రేక్షకుల అంచనాల మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు అంతంత మాత్రం గానే ప్రదర్శన చేస్తూ జట్టును కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అనుభవం లేని ఆటగాళ్లు మాత్రం మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఇలా టి20 వరల్డ్ కప్ లో భాగంగా అంచనాలను అందుకోలేకపోతున్న వారిలో బాబర్ అజాం కూడా ఒకరు.

 ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు బాబర్ ఆజాం.. ఇక ఎన్నో రికార్డులు కూడా కొట్టాడు. అటు పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి ఆరంభాలు అందించి.. ఏకంగా జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో కూడా ఒక వైపు కెప్టెన్ గా మరోవైపు స్టార్ ప్లేయర్గా జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తాడని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందరూ అంచనాలను తారుమారు చేసేస్తున్నాడు. ఎందుకో అతనికి ఈ వరల్డ్ కప్ అస్సలు కలిసి రావడం లేదు అని చెప్పాలి.

ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ నాలుగు మ్యాచ్లో ఆడగా ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు బాబర్ అజాం. ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 15 బంతులు ఆడి కేవలం 6 పరుగులకు వెనుతిరిగాడు. ఇక నాలుగు మ్యాచ్లలో బాబర్ అస్సాం చేసింది కేవలం 14 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఒకసారి అతడి స్కోర్లు చూసుకుంటే 0,4,4,6  గా ఉన్నాయి.  ఒకసారి కూడా  డబల్ డిజిట్ స్కోర్  అందుకోలేకపోయాడు బాబర్. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ నుంచి జట్టు నుంచి తప్పించాలి అంటూ మాజీ ఆటగాళ్లు నేరుగానే విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: