తోపు.. తురుమ్ అన్నారు.. కానీ పాక్ ను నిండా మంచేసాడు?

praveen
అటు వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను మూసుకుపోయేలా చేసుకున్న పాకిస్తాన్ పై విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. ఆ దేశ క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఏకంగా మాజీ ఆటగాళ్లు సైతం స్పందిస్తూ కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్ ను ఉద్దేశిస్తూ అతను ఒక చెత్త కెప్టెన్ అని బహిరంగంగానే పోస్టులు పెడుతూ ఉన్నారు. అతను వెంటనే సారధ్య బాధ్యతల  నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోయిందని చెప్పాలి.


 మరీ మరి ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో పసికూనగా కొనసాగుతున్న జింబాబ్వే చేతిలో ఓడిపోవడానికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఇక పాక్ ఆడిన 3 మ్యాచ్లో కూడా బాబర్ అజం పెద్దగా పరుగులు చేయలేక పేలవ  ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న నేపథ్యంలో చివరికి ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే భారత అభిమానులు కూడా ప్రస్తుతం బాబర్ అజాంను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. గతంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సమయంలో బాబర్ అజాం వరుస పెట్టి అర్థ సెంచరీలు సెంచరీలు చేశాడు. దీంతో బాబర్  తోపు కోహ్లీ కంటే గొప్ప బ్యాట్స్మెన్ అంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు ఆ దేశ క్రికెట్ అభిమానులు.


 ఇలా కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు బాబర్ అజం సెంచరీలు చేసింది స్కాట్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ లాంటి బలహీనమైన జట్లపైన కావడం గమనార్హం. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచ కప్ లో చేతులెత్తేస్తున్నాడు బాబర్ అజాం. దీంతో ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న ఎంతోమంది కోహ్లీ అభిమానులు.. తోపు  అంటూ గొప్పలకు పోయారు.. కానీ ఇప్పుడు పాకిస్తాన్ జట్టును అతని కెప్టెన్సీ తో ఆట తీరుతో నిండా ముంచేసాడు అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: