కోహ్లీ అరుదైన రికార్డ్.. ఏకైక భారత ప్లేయర్?
అయితే ఇక వరల్డ్ కప్ లో భాగంగా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విరాట్ కోహ్లీ మళ్లీ రికార్డుల వేట ప్రారంభించి ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అయితే సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో మాత్రం పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడిన కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వికెట్ చేజార్చుకున్నాడు అని చెప్పాలి. అయితే 12 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.
టి20 వరల్డ్ కప్లలో 1000 రన్స్ పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడిగా ప్రపంచ క్రికెట్లో రెండవ ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో 12 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు కోహ్లీ టి20 వరల్డ్ లో 1001 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ కంటే ముందు శ్రీలంక దిగ్గజా ఆటగాడు జయవర్తనే ఒక్కడే ఉండడం గమనార్ధం. జయవర్ధనే ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్లలో 1016 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం ప్రస్తుతం కోహ్లీ వున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే.. టీమిండియ ఆడబోయే మిగతా మ్యాచ్లో భారీ పరుగులు చేసి ఎవరికి అందనంత దూరంలో వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించడం ఖాయం అనేది మాత్రం తెలుస్తుంది.