పాక్ ను ఓడించగలం.. మొన్న చూశారుగా : నెదర్లాండ్స్ హెడ్ కోచ్

praveen
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ప్రతి ఏడాది వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీమ్ లే మళ్లీ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అతి కష్టం మీద సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించే పసికూన జట్లు మరోసారి ఛాంపియన్ టీంలను ఎదుర్కోలేక ఇంటి ముఖం పట్టడం ఖాయం అని అందరూ భావిస్తూ ఉంటారు.  ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కూడా అందరూ ఇదే అనుకున్నారు.


 కానీ పసికూన జట్లు మాత్రం అందరి అంచనాలను తారుమారు చేశాయి. అప్పటికే వరల్డ్ కప్ లో ఛాంపియన్లుగా కొనసాగుతున్న జట్లకు సైతం షాక్ ఇస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాయి. దీంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మునిగిపోతుంది. ఇక ఇప్పుడు పసికూన జట్లతో మ్యాచ్ జరిగిన కూడా ఎవరు గెలుస్తారో అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఇటీవలే పాకిస్తాన్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో 130 పరుగుల స్వల్ప టార్గెట్ ను  చేదించనివ్వకుండా పాకిస్థాన్ ను కట్టడి చేసి జింబాబ్వే విజయం సాధించింది. ఈ విజయం ఎన్నో చిన్న జట్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది అని చెప్పాలి.


 ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు నేడు మరో పసికూన నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. అయితే పాకిస్తాన్ జింబాబ్వే ఓడించడంతో ఇక తాము కూడా గెలుస్తామని కాన్ఫిడెన్స్ తో ఉన్న నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. పాకిస్తాన్ ఓడించగలం.. లాస్ట్ మ్యాచ్లో అది నిరూపితమైంది అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: