రోహిత్.. ఆ పసికూన జట్టుతో జాగ్రత్త : గవాస్కర్
ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ విషయంలో కూడా అటు ప్రేక్షకుల అంచనాల మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక టి20 వరల్డ్ కప్ పోరు మరింత రంజుగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మరో సంచలనం నమోదు అయింది. ఏకంగా పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ ను పసికూన జింబాబ్వే జట్టు ఓడించి అదరగొట్టింది అని చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాకిస్తాన్ విజయం సునాయాసం అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో జింబాబ్వే బౌలింగ్ విభాగం విజిరం నుంచి 130 పరుగుల సల్ప లక్ష్యాన్ని కూడా కాపాడుకొని ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
ఇకపోతే జింబాబ్వే ప్రదర్శన పై ఇటీవల స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ను చిత్తు చేసి విజయోత్సవంతో ఉన్న జింబాబ్వే తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించాడు. నవంబర్ ఆరవ తేదీన టీమిండియా పసికూన జింబాబ్వేతో మ్యాచ్ ఆడబోతుంది. జింబాబ్వేను తక్కువ అంచనా వేయకూడదు అంటూ సూచించిన సునీల్ గవాస్కర్ టీమిండియ ఆడబోయే మూడు మ్యాచ్లలో కూడా భారీ తేడాతో విజయం సాధించాలి అంటూ సూచించాడు.