బాబర్ ఇక చాలు.. కెప్టెన్సీ వదిలేయ్ : సలీం మాలిక్
విరాట్ కోహ్లీ ఇక టీమిండియా కెప్టెన్సీ వదిలేస్తే బెటర్ అంటూ ఎంతోమంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు అని చెప్పాలి. ఇలా ఎన్నో రోజులపాటు టీం ఇండియా ఓటమి గురించి తీవ్రస్థాయిలో చర్చ జరగగా.. ఎంతో మంది విమర్శలు చేశారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. దీంతో టీమిండియా ఎదుర్కొన్న విమర్శలను ఇక ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా పాకిస్తాన్ జట్టులో స్టార్ బాట్స్మన్ గా కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం ను టార్గెట్ చేస్తూ ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు.
ఇండియా పై పాకిస్తాన్ ఓడిపోవడంతో ఇక కెప్టెన్ బాబర్ మాజీ ప్లేయర్ సలీం మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చాలా ఏళ్లయినప్పటికీ కెప్టెన్సీ నేర్చుకోకపోతే వెంటనే సారథ్యం నుంచి తప్పుకో.. ఇలాంటి తప్పులే చేస్తే సారథ్యాన్ని వదిలేయ్. గతంలో చాలామంది కెప్టెన్సీ వదిలేశారు అంటూ మాజీ ప్లేయర్ సలీం మాలిక్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతేకాకుండా జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉండడం ఎంతో ముఖ్యమని... ఎందుకంటే కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సీనియర్ ప్లేయర్లు సలహాలు సూచనలు ఇస్తారు అంటూ సలీం మాలిక్ వ్యాఖ్యానించాడు.