నెదర్లాండ్స్ తో మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు?
ఈ క్రమంలోనే పటిష్టమైన జట్టుతోనే నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కూడా బలిలోకి దిగాలని భావిస్తుంది అన్నది తెలుస్తుంది అదే సమయంలో ఇక గత మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టులో రెండు లేదా అంతకంటే ఎక్కువ మార్పులు చేసే ఆస్కారం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్లో దారుణంగా విఫలమైన అక్షర పటేల్ ఇక ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్థానాల్లో చాహల్, దీపక్ హుడా, రిషబ్ పంత్ లను బరిలోకి దించే అవకాశం ఉందని ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే అంచనాలను అందుకోలేక విఫలమైన అక్షర పటేల్ స్థానంలో చాహల్ రాక పుష్కలంగా ఉంది అని చెప్పాలి అదే సమయంలో మున్ముందు కీలకమైన మ్యాచుల దృశ్య హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇచ్చి దీపక్ హుడాని ఆడించే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో కీలక సమయంలో చేతులెత్తేసిన దినేష్ కార్తీక్ ను నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోను కొనసాగించే అవకాశాలు ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో ఉంచాలా లేదా అనే విషయం ఇక టాస్ గెలవడం మీద ఆధారపడి ఉంటుంది అన్నది తెలుస్తుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే డీకే యధాతధంగా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే డీకే ని పక్కన పెట్టి పంత్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.