రోహిత్, కోహ్లీ మెచ్చుకున్నారు.. ఇంకేం కావాలి : పాకిస్తాన్ ఫేసర్
దాదాపు ఆరడుగుల కంటే ఎత్తు ఉండే ఈ ఫాస్ట్ బౌలర్ తనదైన బంతులతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లను మెప్పించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మాట్లాడుతూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో అవకాశాలు తగ్గిన తర్వాత తాను ఆస్ట్రేలియాకు మకాం మార్చాను అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ ఏ జట్టుకు ఆడిన అనుభవం కూడా తనకు ఉంది అంటూ తెలిపాడు. అంతే కాదు బాబర్ తో తాను కలిసి మ్యాచ్లు ఆడిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. కానీ పాకిస్తాన్ జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడాలన్న కల కలగానే మిగిలిపోయింది అంటూ తెలిపాడు నెట్ బౌలర్గా ఆర్థికంగా తన పరిస్థితి మెరుగుపడిన తర్వాత కుటుంబాన్ని మొత్తం ఆస్ట్రేలియాకు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టి20 టోర్నీ అయిన బిగ్ బాష్ లీగ్ లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక సిడ్నీలో అంతర్జాతీయ టీమ్లు ఏవైనా ప్రాక్టీస్ చేస్తున్నాయంటే చాలు కచ్చితంగా నెట్స్ లో బౌలింగ్ చేయడానికి తాను వస్తానని మహమ్మద్ ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సిడ్నీలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకి కూడా తాను ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బౌలింగ్ చేశానని ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ క్రికెటర్లు తనను మెచ్చుకున్నారని.. తన బౌలింగ్ బాగుందని భవిష్యత్తులో మరింత ఎదగాలి అంటూ గుడ్ లక్ చెప్పారని ఉబ్బితబ్బిబై పోయాడు సదరు యువ బౌలర్.