ఆ కామెడీ షోలో కాస్టింగ్ కౌచ్ ఉందా.. నిజమేనా?
ఈ సమయంలో జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారు ఆ తర్వాత మాత్రం జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి పోతూ ఉండడం కూడా సంచలనంగా మారిపోయింది. అయితే టీఆర్పి రేటింగ్స్ ఎలా ఉన్నా ఇక ఈ షో చూస్తున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. జబర్దస్త్ లో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే గతంలో జబర్దస్త్ గురించి ఒక ప్రచారం బాగా జరిగింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచుకున్నట్లుగానే జబర్దస్త్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఎంతో మంది ఫిమేల్ కమెడియన్స్ ఇక ఈ కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఇబ్బంది పడ్డారు అన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి ప్రచారాన్ని ఎవరు తెరమీదకి తీసుకువచ్చారు అన్నది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఓ స్టార్ కమెడియన్ ఏకంగా లేడీ కమెడియన్ విషయంలో మితిమీరి ప్రవర్తించాడని.. ఇక లేడీ కమెడియన్స్ మల్లెమల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్తలు వినిపించాయి. ఇలా జబర్దస్త్ పై వస్తున్న వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఇక ఈ టాక్ మాత్రం ఆ వైరల్ గా మారిపోయింది.