ఇండియా సెమీస్ వెళ్లేందుకు.. 30% అవకాశాలు : కపిల్ దేవ్
అదే సమయంలో ఈ ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అనే విషయంపై కూడా భారత క్రికెట్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే టీమిండియా అటు వరల్డ్ కప్ గెలిచి దాదాపు 15 ఏళ్లు గడిచిపోతుంది. ఈ క్రమంలోనే ఏడాది రోహిత్ కెప్టెన్సీలో అయినా టీమిండియా కు వరల్డ్ కప్ దక్కుతుందేమో అని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కాగా ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ టీమ్ ఇండియా బలాబాలాలపై తమ రివ్యూ ఇస్తున్నారని చెప్పాలి. ఇక ఇటీవలే స్పందించిన టీమిండియా మొదటి వరల్డ్ కప్ కెప్టెన్,మాజీ ఆటగాడు కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టి20 వరల్డ్ కప్ లో ఇండియా జట్టు సెమీస్ కూ వెళ్లే అవకాశం 30% మాత్రమే ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉన్న జట్టు విజయాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరో బౌలర్గా ఉపయోగపడతాడు. మంచి బ్యాటర్, ఫీల్డర్ కూడా. బూమ్రాస్థానంలో వచ్చిన షమీ మంచి బౌలర్. అతన్ని రోహిత్ ఎలా వాడుకుంటాడు అన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇక నా అంచనా ప్రకారం టీమ్ ఇండియా జట్టు ఈ ఏడాది వరల్డ్ కప్ లో సెమిస్ వెళ్లే అవకాశాలు మాత్రం 30% మాత్రమే ఉన్నాయి అంటూ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.