కోహ్లీ, రోహిత్ క్రేజ్ వేరే లెవెల్.. వార్మప్ మ్యాచ్ కి రికార్డు వ్యూస్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో మోస్ట్ పాపులర్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇక ఇద్దరు కూడా కీలక ఆటగాళ్లుగా జట్టును ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభం వరకు కూడా భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ తనదైన వ్యూహాలతో ముందుకు నడిపించాడు. ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ తనదైన కెప్టెన్సీ తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇద్దరు జట్టులో ఉన్నారు అంటే చాలు టీమ్ ఇండియాదే విజయం అని భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే సాధారణంగా భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టు మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇక భారత జట్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే మాత్రం కొన్ని కొన్ని సార్లు వ్యూస్ ఒక్కసారిగా పడిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది టీమిండియా. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్లలో ఆడుతుంది. అయితే ఇటీవల వార్మప్ మ్యాచ్ లలో కూడా రికార్డు వ్యూస్ లభించాయి అని చెప్పాలి.


 ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన వర్మ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అందించాయి. అయితే అభిమానులు వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ ఎగబడి చూశారు అని చెప్పాలి. అంతర్జాతీయ మ్యాచ్ అన్న విధంగానే ఫీల్ అయ్యారు. దీంతో హాట్ స్టార్ లో గరిష్టంగా 50 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక కనిష్టంగా 30 లక్షలకు పైనే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఇలా రోహిత్ విరాట్ కోహ్లీ ఉన్న ప్రాక్టీస్ మ్యాచ్ కే 50 లక్షల వ్యూస్ వస్తే.. అటు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ ఆడిన ద్వితీయ శ్రేణి జట్టు ఆడిన మ్యాచ్లకు 20 లక్షల వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం. దీని బట్టి కోహ్లీ, రోహిత్ క్రేజ్ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: