ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్.. సీనియర్లను కాదని అతనికి ఛాన్స్?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియా టికెట్లో ఎవరు ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే.  పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న ఆరోన్ పించ్ ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వన్డే ఫార్మాట్లో ఒక ఆటగాడిగా కొనసాగుతానని.. కానీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఒత్తిడి కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే టి20  కెప్టెన్ గా మాత్రం కొనసాగుతాను అంటూ  ఫించ్ స్పష్టం చేశాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆరోన్ పించ్ కెప్టెన్సీ లోనే ఆస్ట్రేలియా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే అటు వన్డే ఫార్మాట్కు కొత్త కెప్టెన్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై కేవలం ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఆసక్తికర చర్చ జరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్ల పేర్లు తెరమీదకి వచ్చాయి. జట్టులో ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉండడంతో ఇక వారిలో ఒకరికి కెప్టెన్సీ దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఆ జట్టు స్టార్ బౌలర్ కి కెప్టెన్సీ అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.


 ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ గా ఆసీస్ స్టార్ బౌలర్ అయిన పాట్ కమీన్స్ ను నియమిస్తున్నట్లు ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కాగా 29 ఏళ్ల ప్యాట్ కమ్మిన్స్  కు సీనియర్లను కాదని కెప్టెన్సీ అప్పగించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.  ఇకపోతే నవంబర్లో జరిగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి జట్టును ముందుకు నడిపించబోతున్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నిర్ణయం పై అటు అభిమానులు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: