వారెవ్వా.. హైదరాబాద్ హ్యాట్రిక్.. తిలక్ వర్మ అదుర్స్?
కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకున్నా హైదరాబాద్ జట్టు ఇక వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా హైదరాబాద్ జట్టు విజయం సాధించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పాలి.. ఇక ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాని సొంతం చేసుకుంది. ఇటీవల గ్రూప్ బి మ్యాచ్ లో త్రిపుర జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది అని చెప్పాలి.
ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది త్రిపుర జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది అని చెప్పాలి. ఇక త్రిపుర జట్టులో బిక్రమ్ కుమార్ 56 బంతుల్లో 73 పరుగులు చేసి చెలరేగిపోయాడు.. ఇక ఆ తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే ఇక అటు త్రిపుర జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు కాస్త తడబడ్డారు. ఈ క్రమంలోనే చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్లో ఇక హైదరాబాద్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఇక తిలక్ వర్మ హైదరాబాద్ జట్టు విజయంలో 46 బంతులు 67 పరుగులు చేసి కీలకపాత్ర వహించాడు.