అయ్యో పాపం.. బొక్క బోర్లా పడిన బ్యాట్స్మెన్?
ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఒక ఫన్నీ సంఘటన జరిగింది. ఇది కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో రెండో మ్యాచ్ లో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ చేయగా యూఏఈ జట్టు బౌలర్లు పట్టు బిగించడంతో నెదర్లాండ్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడంలో ఎంతో ఇబ్బంది పడ్డారు.
చివరి వరకు ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొనగా ఇక ఒక బంతి మిగిలి ఉండగానే నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. యూఏఈ జట్టు సభ్యుడు ఆయాన్ అఫ్జల్ ప్రపంచ కప్ లో ఆడిన అత్యంత పిన్ని వయసుకుడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయిన అతడు తిరిగి వెళుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద బొక్క బోర్లా పడిపోయాడు. రోప్ కాలికి తగలడంతో ఈ ఘటన జరిగింది. ఇక ఇదుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇది ఎంతో మంది నెటిజెన్స్ అయ్యో పాపం అంటున్నారు. కాగా అతను ఏడు బంతులలో ఐదు పరుగులు చేసి చివరికి వికెట్ కోల్పోయాడు.