వరల్డ్ కప్ టోర్ని.. అరుదైన రికార్డ్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. నేడు మొదటి మ్యాచ్ జరిగింది. అయితే సాధారణంగా టి20 వరల్డ్ కప్ లో వివిధ జట్లకు సంబంధించిన ప్లేయర్లు రికార్డు సృష్టించడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి కొత్త విషయం జరిగింది. టి20 వరల్డ్ కప్ లో ఆడుతున్న ప్లేయర్లు కాదు ఏకంగా టి20 వరల్డ్ కప్ టోర్నినే ఒక అరుదైన రికార్డు సృష్టించింది అని చెప్పాలి   ఇక ఇలా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.

 ఇంతకీ ప్రారంభం కాపుకముందే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 వరల్డ్ ఏం రికార్డు సృష్టించిందో తెలుసా.. ఏకంగా ఈ మెగా ఈవెంట్ 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.  ఇప్పటివరకు ఏ క్రికెట్ ఈవెంట్ ఎప్పుడు కూడా ఇన్ని దేశాలలో ప్రత్యక్ష ప్రసారం కాలేదు అని చెప్పాలి. ఇలా 222 దేశాల ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే తొలిసారి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ కు సంబంధించి దాదాపు పదివేల గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని చానళ్లు ఇవ్వబోతున్నాయ్ అనేది తెలుస్తుంది. అంతే కాకుండా ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే అన్ని స్టేడియాలలో కూడా ఐసీసీ దాదాపు 35 పైగా కెమెరాలను ఏర్పాటు చేసింది.

 అంతేకాదు మ్యాచ్ ముగిసిపోయిన తర్వాత ఇక ఆ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ ని టీ20 వరల్డ్ కప్ డాట్ కాం లో..  టి20 వరల్డ్ కప్ యాప్ లో గాని వీక్షించేందుకు అవకాశం కల్పించింది. ఇకపోతే భారత్లో వరల్డ్ కప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం లాంటి భాషల్లో కూడా ఇక వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇటీవలే నేడు గిలాంగు వేదికగా జరిగిన శ్రీలంక - నమీబియా మ్యాచ్లో ఊహించని విధంగా పసికునా నమీబియా ఏకంగా 50 పైగా పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: