ఆసియా కప్ : నేడే ఫైనల్ మ్యాచ్?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. నేడే ఈ ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతుంది అని చెప్పాలి.  గత కొంతకాలం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతూ తిరుగులేని జట్టుగా ప్రస్తానాని కొనసాగిస్తున్న టీమిండియా మహిళల జట్టు అందరూ ఊహించినట్లు గానే ఫైనల్లో అడుగు పెట్టింది. అదే సమయంలో.. ఆసియా కప్ ఫైనల్లో మోస్ట్ రన్నర్ ఆఫ్ జట్టుగా కొనసాగుతున్న శ్రీలంక కూడా మళ్లీ ఫైనల్ కు వచ్చేసింది.

 నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఆసియా కప్ హిస్టరీలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా టీమిండియా మహిళల జట్టు కొనసాగుతుంది.. ఇప్పటివరకు ఆరుసార్లు ఆసియా కప్ విజేతగా  నిలిచింది. అయితే మొన్నటికి మొన్న పురుషుల జట్టు ఆసియా కప్ లో నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు టైటిల్ గెలిచి అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భారత మహిళల జట్టు భావిస్తుంది. అయితే ఎంతో కష్టపడి ఫైనల్ గా వచ్చిన నాలుగు సార్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక కొనసాగుతుంది.

 ఈసారైనా ఆసియా కప్ ముద్దాడలనే పట్టుదలతో ఉంది శ్రీలంక జట్టు. ఇక ఈ రెండు జట్ల మధ్య నేడు జరగబోయే పోరు ఎంతో ఆసక్తి రేపుతుంది. గత చరిత్ర రికార్డులు బలాబలాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. భారత జట్టు ముందు అటు శ్రీలంక మాత్రం ఎక్కడా సరితూగదు అని చెప్పాలి.. అదే సమయంలో ఈ ఆసియా కప్ లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్ వరకు వచ్చిన శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలులేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా శ్రీలంకను ఇప్పటికే నాలుగు సార్లు ఫైనల్లో ఓడించి కప్పు గెలుచుకుంది భారత జట్టు. మరి నేడు జరగబోయే మ్యాచ్లో అదే ఆదిపత్యాన్ని కొనసాగిస్తుందా లేకపోతే కప్పు గెలవాలనే కసితో ఉన్న శ్రీలంక పట్టు సాధిస్తుందా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: