వరల్డ్ బెస్ట్ బౌలర్ను ఎలా పక్కన పెట్టారు.. టీమిండియా సెలెక్టర్లపై ఆగ్రహం?
ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతన్ని తుదిచెట్టు ఎంపికకు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. అయితే మొదట్లో అతను జట్టులోకి వచ్చిన సమయంలో వరల్డ్ కప్ లో కీలక ఆటగాడిగా మారతాడని అందరూ అనుకున్నారు. కానీ అతని ఆట తీరు ఎవరికీ నచ్చలేదు. చివరికి అతని గురించి పట్టించుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో అటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లీ మాత్రం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచ కప్ లోకి తీసుకోకపోవడాన్ని తప్పుపడుతూ భారత సెలక్టర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేస్తాడు. కానీ సెలెక్టరు అతని పక్కన పెట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కారును మీ దగ్గర పెట్టుకొని దాని ఉపయోగించకుండా గ్యారేజ్ లో పడేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.. అప్పుడు ఆ కారుకు విలువ ఉంటుందా. ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసి ఉండాల్సింది. అతను యువకుడే కావచ్చు.. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేకపోవచ్చు. కానీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసర గలిగే సత్తా ఉన్నవాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై పేస్ బౌలర్లు సమర్థవంతంగా రాణిస్తారు అంటూ బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.