ఆ పదవి ఇస్తామంటే.. గంగూలి నో చెప్పాడట తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో లెజెండరి క్రికెటర్ల జాబితాలో ఒకరిగా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ అత్యుత్తమ పదవి అయినా బిసిసిఐ అధ్యక్ష హోదాలో కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇక జట్టులో అనూహ్యమైన మార్పులు రావడంలో సౌరబ్ గంగూలీ కీలకమైన పాత్ర వహించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికే ఆయన అలంకారంగా మారిపోయారు అని చెప్పాలి.


 అయితే ఎంతటి వారైనా సరే ఇక అధ్యక్ష పదవి పదవీకాలం ముగిసిన సమయంలో చివరికి తప్పుకోక తప్పదు. ఇక ఇప్పుడు లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ విషయంలో కూడా ఇదే జరగబోతుంది అన్నది తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో సౌరబ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ పదవీకాలం ముగుస్తుంది. కాగా కొన్ని రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.



 కానీ అటు సౌరబ్ గంగూలీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని అప్పజెప్పేందుకు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధంగా లేదు అన్నది తెలుస్తుంది. ఇక ఇదంతా జరగడం వెనక రాజకీయ హస్తం ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమం లోనే ఐసీసీ చైర్మన్ పదవి ఆశించిన సౌరబ్ గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని అటు బీసీసీఐ భావించిందట. కానీ సౌరబ్ గంగూలీ మాత్రం దాన్ని తిరస్కరించినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. కాగా బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ పదవీకాలం వచ్చేవారం ముగియనుంది. అయితే వచ్చే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలి స్థానంలో రోజర్ బిన్ని ఎంపిక కానునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: