చాలా మిస్ అవుతున్నా.. హార్థిక్ పాండ్యా ఎమోషనల్?

praveen
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా  ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా తన బ్యాటింగ్ తో దుమ్ము దులిపేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో అదరగొట్టిన హార్దిక్ ఈ సిరీస్ ముగిసిన వెంటనే అటు టీమిండియా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పయనం అయ్యాడు. సౌత్ ఆఫ్రికా పై టి20 సిరీస్ గెలిచిన జోరులో ఉన్న టీమిండియా ఇక అటు ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కోసం మరింత తీవ్రంగా ప్రాక్టీస్ లో మనకి తేలుతుంది అని చెప్పాలి..


 ఇకపోతే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్  హార్థిక్ పాండ్యా  ఇటీవలే తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది సహచర ఆటగాళ్లు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ పాండ్యాను విష్ చేశారు. అయితే తన పుట్టినరోజు నాడు హార్థిక్ పాండ్యా పెట్టిన ఒక పోస్ట్ మాత్రం ట్విట్టర్  వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తన కుమారుడని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.


 తన పుట్టినరోజు నాడు తనకు ఎంతో ఇష్టమైన కుమారుడితో సమయం గడప లేకపోవడం ఎంతో బాధగా ఉంది అంటూ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఇక మా అబ్బాయిని ఎంతో మిస్ అవుతున్న.. నేను అందుకున్న గొప్ప బహుమతి తనే అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. ఈ క్రమంలోనే తన కుమారుడితో  ఇంట్లో ఎంతో సరదాగా గడుపుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని చెప్పాలి.. ఇక ఈ వీడియో అభిమానులు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన వీడియోలో హార్థిక్ పాండ్యా తన కొడుకుని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు అన్న విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: