తండ్రి జైల్లో.. కొండంత బాధ మనసులో.. అయినా 266 రన్స్ చేశాడు?
క్రికెటర్ల జీవితాల్లో కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. అన్నింటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే దానిని జీవితం అని అంటూ ఉంటారు. టీమిండియా వెటరన్ ప్లేయర్ నమన్ ఓజా లైఫ్ కూడా అలాంటిదే అని చెప్పాలీ. ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా సెంచరీ చేసి అదరగొట్టాడు నమన్ ఓజా. శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ లో 71 బంతుల్లోనే 108 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలీ. ఇక ఇతనికి ఇన్నింగ్స్ చలవతోనే భారత లెజెండ్స్ జట్టు ఎంతో సునాయాసంగా ఫైనల్లో విజయం సాధించింది అని చెప్పాలీ.
ఇకపోతే ఈ సిరీస్ మొత్తంలో 137 స్ట్రైక్ రేటుతో 266 పరుగులు చేసి ఇండియా లెజెండ్స్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టోర్నీ మొత్తంలో పది సిక్సర్లు 30 ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే సరిగ్గా మూడు నెలల క్రితం నమన్ ఓజా తీవ్రవోడు దుడుకులు ఎదుర్కొన్నాడు. అక్రమాస్తుల ఆరోపణలు రావడంతో అతని తండ్రి నమన్ ఓజా పై చీటింగ్ కేసు ఇతర కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు అతని అరెస్టు చేశారు. దీంతో మనస్థాపంతో బాధపడిన నమన్ ఓజా మూడు నెలల గ్యాప్ లోనే మళ్లీ మైదానంలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని దక్కించుకున్నాడు.